Song no: 105
రా – ఆనందభైరవి
తా – త్రిపుట
రా – ఆనందభైరవి
తా – త్రిపుట
రారె గొల్లవారలారా – నేటి – రాత్రి బేత్లెహేము నూర = జేరి మోక్షదూత – కోరి దెల్పెను క్రీస్తు – వారి జాడకన్ను – లారా జూతము వేగ ॥రారె॥
- పుట్టు చావులు లేనివాడఁట – పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట = ఎట్టి వారలను జే – పట్టి పాపము లూడఁ – గొట్టి మోక్షపత్రోవఁ – బెట్టు వాడట వేగ ॥రారె॥
- బహుకాలమాయెను వింటిమి – నేడు – మహికివచ్చుట కనుగొంటిమి = విహితముతోడ – సేవించి వత్తము మోక్ష – మహితుని గని దుఃఖ – రహితులమవుదము. ॥రారె॥