రాగం - బేహాగ్ |
తాళం - ఆది |
సర్వ క్రైస్తవ సంఘ మహి మా స్త్రోత్రగీతల్ స్వీకరింపుమా ||సంఘ||
సర్వ జనరక్షణము నీవే సర్వలోక నిరీక్షణ నీవే ||సంఘ||
తల యె క్రీస్తయ తనువే భక్తులై తగిన సఖ్యత నైక్యత నుందురు ||సంఘ||
నిత్య మాతనియందు నిలచి నెగడు వారే నిజక్రైస్తవులు ||సంఘ||
ఆత్మఫలములు జాపన నేర్చిన యను భవంబే క్రైస్తవంబు ||సంఘ||
వరుడనీవై వరదుడ వీవై విశ్వ భారతి నుద్ధరింపుమా ||సంఘ||
