ఈ లోకం మాయరా – గతియించే
ఛాయరా
పరలోకమే శాశ్వతంరా – ప్రభునామమే శరణంరా
స్థిరమైన రాజ్యము కొరకే – అన్వేషణ చేయరా
పరలోకమే శాశ్వతంరా – ప్రభునామమే శరణంరా
స్థిరమైన రాజ్యము కొరకే – అన్వేషణ చేయరా
1 అందమైన రంగులతో రకరకాల హంగులతో
నిన్ను ఆకర్షించురా
గురిచూసి ఎర వేసి పాపంలో పడద్రోసి
దైవానికి దూరం చేసేనురా
నిన్ను ఆకర్షించురా
గురిచూసి ఎర వేసి పాపంలో పడద్రోసి
దైవానికి దూరం చేసేనురా
2 పాపిని పరిశుద్ధపరచి తన సుతునిగా చేయదలచి
యేసు పరమును వీడెరా
ఇలలోని తనవారిని పరలోకం చేర్చాలని
భుమ్యాకాశం మధ్య నిలిచెరా
యేసు పరమును వీడెరా
ఇలలోని తనవారిని పరలోకం చేర్చాలని
భుమ్యాకాశం మధ్య నిలిచెరా