Kanapurambulo gadu vinthaga neeru కానాపురంబులో గడు వింతగా నీరు

కానాపురంబులోఁ

Song no: 562
    కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||

  2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద స దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||

  3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||

  4. చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||

  5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||

Song no: 171
    కానాపురంబులోఁ గడు వింతగా నీరు
    జానుగా ద్రాక్షరసమును జేసి
    పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన
    దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||

  1. రావయ్య పెండ్లికి రయముగా నో యేసు } 2
    ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి } 2
    కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
    భావమాలిన్యంబుఁ బాపి యిపుడు
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  2. దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద } 2
    స దయుఁడవై కాపాడు తండ్రి వలెను } 2
    నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి
    భయము లేకుండ గ బ్రతుక నిమ్ము
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  3. ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర } 2
    లెప్పుడును మదిలోన నిడికొనుచును } 2
    దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు
    గొప్పగా నెరవేర్పు గూడ నుండు
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  4. చక్కఁగా నెగడింప సంసార భారంబు } 2
    నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి } 2
    నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి
    క్రక్కు నను దీవించు కరుణానిధీ
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||

  5. పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ } 2
    పెల్లుగా బోధింప వెరవు జూపు } 2
    మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు
    జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము
    జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
    ||కానా||
Blogger ఆధారితం.