ఆరాధింతును దేవా ఆత్మ స్వరూపివి నీవని

    ఆరాధింతును దేవా - ఆత్మ స్వరూపివి నీవని "2"
    ఆత్మతో సత్యముతో ఆరాధించి "2"
    స్తోత్రము చేసేదనయ్య నీకె స్తోత్రము చేసేదనయ్య
    ఆరాధింతును దేవా - ఆత్మ స్వరూపివి నీవని

    1.పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు-మహోన్నతుడవు నీవే "2"
    నీనామమునే గానము చేసి "2"
    నిరతము నిన్నే కీర్తించెదను "2"
    స్తోత్రము చేసేదనయ్య - నీకె స్తోత్రము చేసేదనయ్య
    ఆరాధింతును దేవా - ఆత్మ స్వరూపివి నీవని

    2.వేల్పులలోన మహనీయుడవు-మహా ఘనుడవు నీవే"2"
    నీకు సాటి సామానులు లేరు "2"
    నీఒక్కడవే పూజ్యుడవయ్యా "2"
    స్తోత్రము చేసేదనయ్య - నీకె స్తోత్రము చేసేదనయ్య
    ఆరాధింతును దేవా - ఆత్మ స్వరూపివి నీవని

    3.రాజుల రాజ ప్రభువుల ప్రభువా-సర్వోనతుడవు నీవే"2"
    యుగయుగములకు రాజువు నీవే "2"
    నీరాజ్యమునకుఅంతము లేదు "2"
    స్తోత్రము చేసేదనయ్య నీకె స్తోత్రము చేసేదనయ్య
    ఆరాధింతును దేవా - ఆత్మ స్వరూపివి నీవని "2"
    ఆత్మతో సత్యముతో ఆరాధించి "2"
    స్తోత్రము చేసేదనయ్య నీకె స్తోత్రము చేసేదనయ్య

Post a Comment

కొత్తది పాతది