4
రాగం - కాంభోజి తాళం - ఆదికొండవలె భారమై లోక పాపములు దండింపబడె ఘోరమై నిండు భారము క్రింద నిలుచున్న వేళను గుండె దిగులున దనువు నిండె రక్తపు జెమట మెండుకొని దుఃఖములతో నా తండ్రి యీ పాత్రమును నా కడ నుండి తొలగించుటకు మనపై యుండినను జేయమని వేడెను ||ఏమాశ్చర్యము||
కడు దుర్మార్గులచేతను క్రీస్తుడు పట్టు వడె దానంతట తాను చెడుగు లెందరు నింద జేసి మోముపై నుమిసి వడిముళ్లతో నల్ల బడిన కిరీటము తడయ కౌదల బెట్టి కరముల నడుగులను సిలువ నిడి మేకులు దొడిపి ప్రక్కను రక్తజలములు దొరగ గుంతము గ్రుచ్చి రహహా ||ఏమాశ్చర్యము||
ఇరు పార్శ్యముల నిద్దరి దొంగల నునిచి మరణావస్థల బెట్టిరి నిరపరాధి ప్రభువు దురితాత్ము లొనరించు తరుచు బాధల కోర్చి మరి వారి గరుణించి యెరుగ రేమి యొనర్తురో యీ దురిత జీవులు వీరి నోహో పరమ జనక క్షమించు మని తన యరుల కొరకై వేడు కొనియెను ||ఏమాశ్చర్యము||
-
Konda Vale Bhaaramai – Loaka Paapamulu – Dhandimpa Bade Ghoaramai = Nindu Bhaaramu Krindha – Niluchunna Velanu – Gunde Dhiguluna Thanuvu – Ninde Rakthapu Chemata = Endukoni Dhukkamulathoa Naa – Thandri Yee Paathramunu Naa Kada – Nundi Tholaginchutaku Manapai – Yundinanu Cheyamani Vedeu || Yemascharyamu ||
-
Kadu Dhurmaargula Chethanu – Kreesthundu Pattu – Vade Thaananthata Thaanu = Chedugu Lendharu Nindha – Jesi Moamupai Numisi – Vadi Mullathoa Nalla – Badina Kireetamu = Thadaya Kowdhala Betti Karamula – Nadugulanu Siluva Nidi Mekulu – Dhodipi Prakkanu Raktha Jalamulu – Dhoraga Gunthamu Gruchchi Rahahaa
|| Yemascharyamu ||
- Eiru Paarsyamula Nidhdhari – Dhongala Nunichi – Maranaavasthala Bettiri = Niraparaadhi Prabhuvu – Dhuri Thaathmulonarinchu – Tharuchu Baadhala Koarchi Ari Vaaru Karuninchi = Yeruga Remi Yonarthuroa Yee – Dhurithas Jeevulu Veeri Noahoa – Parama Janaka Kshaminchu Mani Thana – Yarula Korakai Vedu Koniyenu || Yemascharyamu ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి