Song no:
ప్రేమించావు నన్ను పోషించావు – నాకై సిలువపై ప్రాణమిచ్చావు/2/
ప్రేమించావు నన్ను పోషించావు – నాకై సిలువపై ప్రాణమిచ్చావు/2/
నాకై సిలువపై బాధ నొందావు – నాకై సిలువపై రక్తమిచ్చావు /2/ప్రేమిం /
1. నా తలంపులను బట్టే నీతలకు ముళ్ళు
నే చేసిన హత్యలకే నీ చేతుల మేకులు/2/
పాపిని ఆదరించావు నాసిలువ – నీవీపు పై మోసావు/2/ప్రేమిం/
2. నాకాళ్ళ నడకలకై నీ కాళ్ళకు సీలలు
నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము
పాపిని కరుణ చూపావు – నా సిలువ నీ భుజముపై మోసావు /2/ ప్రేమిం/