Yehovaye na kapariga nakemi kodhuvagunu యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును

Song no: 83
    యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగును    (2X)

  1. పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
    శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును || యెహోవాయే ||

  2. గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
    నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును || యెహోవాయే ||

  3. నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
    నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది || యెహోవాయే ||

  4. నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును
    నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును || యెహోవాయే ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes