గురిలేని బ్రతుకిది – దరిచేర్చవా
నా ప్రభు
నీ తోడు లేక నే సాగలేను – నీ నీడనే కోరితి
నీ తోడు లేక నే సాగలేను – నీ నీడనే కోరితి
1 గాలికెగురు పొట్టువంటిది – నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును – ఆవిరివంటి నా బ్రతుకు
అంతలోనే మాయమగును – ఆవిరివంటి నా బ్రతుకు
2. వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును – బుడగవోలె నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును – బుడగవోలె నా బ్రతుకు
3. కలకాలం నిలిచిపోవును – ప్రభువా
నీ దివ్య వాక్యం
నిత్యజీవమనుగ్రహించును – పరిశుద్దుడా నీ నామం
నిత్యజీవమనుగ్రహించును – పరిశుద్దుడా నీ నామం