మాట్లాడే దేవా నా యేసయ్యా
మాట తప్పవు నీవు మారనివాడవయ్యా
మాట తప్పవు నీవు మారనివాడవయ్యా
1 నీ మాటలో జీవమున్నది
అదియే నన్నిలలో బ్రతికించుచున్నది
మాటతోనే మృతలలేపినావా – మరణముల్లు విరిచిన ఓ దేవా
అదియే నన్నిలలో బ్రతికించుచున్నది
మాటతోనే మృతలలేపినావా – మరణముల్లు విరిచిన ఓ దేవా
2 నీ మాటలో స్వస్థతున్నది
అదియే నా రోగము తొలగించుచున్నది
మాటతోనే చక్కజేసినావా – సర్వశక్తి కలిగిన ఓ దేవా
అదియే నా రోగము తొలగించుచున్నది
మాటతోనే చక్కజేసినావా – సర్వశక్తి కలిగిన ఓ దేవా
3 నీ మాటలో జ్ఞానమున్నది
అదియే నీ త్రోవలో నడిపించుచున్నది
మాటతోనే బుద్ధినేర్పినావా – హృదయమును ఎరిగిన ఓ దేవా
అదియే నీ త్రోవలో నడిపించుచున్నది
మాటతోనే బుద్ధినేర్పినావా – హృదయమును ఎరిగిన ఓ దేవా