Sagipodhunu na viswasamunaku karthayaina సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో

Song no: 135

    సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
    సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
    సాగిపోదును నా యేసయ్యతో

  1. ఆత్మీయ బలమును పొందుకొని
    లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
    దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
    నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును ||

  2. నూతనమైన మార్గములో
    తొట్రిల్లకుండ నడిపించును - నవ
    దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
    నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును ||

  3. శ్రేష్ఠమైన బహుమానముకై
    సమర్పణ కలిగి జీవింతును - మరి
    దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
    నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes