హోమ్ఉదయారాధన📜 తెల్లవారిన వేళ 514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది akk 42 ప్రాతస్తవము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ|| నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ|| భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ|| దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ|| పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ|| తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ|| నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ|| భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ|| దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ|| పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ|| Post a Comment కొత్తది పాతది సంప్రదింపు ఫారమ్ Home More Lyricsఆనంద కీర్తనలుఆంధ్ర క్రైస్తవ కీర్తనలుContact PageError Page Christmas Easter Lent Good Friday Ash Wednesday Palm Sunday Lent