Song no: 189
- ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి
- ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక
ఎండమావి నీరు చూచి మోసపోనిక
సాగిపోయే నీడచూచి కలత చెందక
నీకై జీవించెద || ప్రేమాంబుధి ||
- సంద్రమందు అలలవలె అలసిపోనిక
ధరణిలోని చూచి ఆశచెందక
భారమైన జీవితాన్ని సేదదీర్చిన
నీ ప్రేమ పొందెద || ప్రేమాంబుధి ||
నీ ప్రేమయే నా ధ్యానము
నీ స్నేహమే నా ప్రాణము
నీవే నా గానము
కామెంట్‌ను పోస్ట్ చేయండి