ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి నీ ప్రేమయే నా ధ్యానము

Song no: 189

    ప్రేమాంబుధి కృపానిధీ నడిపించుసారధి
    నీ ప్రేమయే నా ధ్యానము
    నీ స్నేహమే నా ప్రాణము
    నీవే నా గానము

  1. ఎదుట నిలిచి నీవు ఉంటె భయములేదిక
    ఎండమావి నీరు చూచి మోసపోనిక
    సాగిపోయే నీడచూచి కలత చెందక
    నీకై జీవించెద || ప్రేమాంబుధి ||

  2. సంద్రమందు అలలవలె అలసిపోనిక
    ధరణిలోని చూచి ఆశచెందక
    భారమైన జీవితాన్ని సేదదీర్చిన
    నీ ప్రేమ పొందెద || ప్రేమాంబుధి ||

Post a Comment

أحدث أقدم