అవని అంత ఆయనదే అయినా స్ధలమేది

    అవని అంత ఆయనదే అయినా స్ధలమేది
    అందరికి హృదయముంది యేసుకు చోటేది

  1. పశువులు తమ యజమాని స్వరమెరుగును గాని
    నరులు దైవతనయుని స్వరమెరుగలేదు అదే శోచనీయం

  2. పసి పాపగ జన్మంప పశుల తొట్టి పరుపాయె
    తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె లోకం, సిలువనిచ్చె లోకం

  3. సిలువ మీద యేసయ్య కనులు మూయ వేళా
    సమాధులు తన కనులు తెరచి చూచె నేల? సజీవులైరిచాల