పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను

యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి తిరిగి జన్మిస్తే ఆయన కొరకు జీవించగలం ఆయనను మనలో చూపించగలం

    పరమ దైవమే మనుష్య రూపమై
    ఉదయించెను నాకోసమే
    అమరజీవమే నరుల కోసమే
    దిగివచ్చెను ఈ లోకమే
    క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3) ||పరమ||

  1. అకార రహితుడు ఆత్మ స్వరూపుడు
    శరీరము ధరియించెను
    సర్వాధికారుడు బలాడ్యధీరుడు
    దీనత్వమును వరించెను
    వైభవమును విడిచెను
    దాసునిగా మారెను (2)
    దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా ||పరమ||

  2. అనాదివాక్యమే కృపాసమేతమై
    ధరపై కాలుమోపెను
    ఆ నీతితేజమే నరావతారమై
    శిశువై జననమాయెను
    పాపి జతను కోరెను
    రిక్తుడు తానాయెను (2)
    భూలోకమును చేరెను యేసురాజుగా ||పరమ||

  3. నిత్యుడు తండ్రియై విమోచనార్ధమై
    కుమారుడై జనించెను
    సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమై
    రాజ్యమునే భరించెను
    మధ్య గోడ కూల్చను
    సంధిని సమకూర్చను(2)
    సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా ||పరమ||


Yesu Puttukoloni Paramaardhaanni Grahinchi Thirigi Janmisthe Aayana Koraku Jeevinchagalam Aayananu Manalo Choopinchagalam

    Parama Daivame Manushya Roopamai
    Udayinchenu Naa Kosame
    Amara Jeevame Narula Kosamai
    Digi Vachchenu Ee Lokame
    Kreesthu Puttenu – Hallelooya
    Kreesthu Puttenu – Hallelooya
    Kreesthu Puttenu – Hallelooyaa (2) ||Parama Daivame||

  1. Aakaara Rahithudu Aathma Swaroopudu
    Shareeramunu Dharinchenu
    Sarvaadhikaarudu Balaadya Dheerudu
    Deenathvamunu Varinchenu
    Vaibhavamunu Vidichenu – Daasuniganu Maarenu – (2)
    Deevena Bhuviki Thechchenu – Mukthi Baatagaa… ||Parama Daivame||

  2. Anaadi Vaakyame Krupaa Samethamai
    Dharapai Kaalu Mopenu
    Aa Neethi Thejame Naraavathaaramai
    Shishuvai Jananamaayenu
    Paapi Jathanu Korenu – Rikthudu Thaanaayenu (2)
    Bhoolokamunu Cherenu – Yesu Raajugaa… ||Parama Daivame||

  3. Nithyudu Thandriye Vimochanaardhamai
    Kumaarudai Janinchenu
    Sathya Swaroopiye Rakshana Dhyeyamai
    Raajyamune Bharinchenu
    Madhya Goda Koolchanu – Sandhini Samakoorchanu – (2)
    Sakhyatha Nilupa Vachchenu – Shaanthi Doothagaa… ||Parama Daivame||

أحدث أقدم