Mattivira vattivira mannuvura mannavura మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా

    మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా 
    కాయము మూయము ఖాయమురా అయ్యయ్యో (2)

  1. అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి
    సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో
    నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో!

  2. నువ్వేసిన వేషాలు నువు చేసిన మోసాలు
    నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో
    నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో!

  3. నీ బ్రతుకుదెరువుకోసం బైబిల్ను చేతబట్టి
    పరమార్థం మర్చిపోయావే అయ్యయ్యో
    ఆత్యలతో ఆడుకొన్నావే అయ్యయ్యయ్యో!

  4. సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీ
    సొంతానికి ఖర్చు చేశావే అయ్యయ్యో
    శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో!

  5. పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి
    దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో
    తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో !

  6. నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే
    పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా
    నీ పాపం కడిగివేయునులే మెస్సయ్యా
أحدث أقدم