Manninchumaa deva mannimchuma lokanni preminchi మన్నించుమా మన్నించుమా మన్నించుమా దేవా మన్నించుమా

మన్నించుమా మన్నించుమా
మన్నించుమా దేవా మన్నించుమా

male ( లోకాన్ని ప్రేమించి పాపాన్ని ఆశించి
నిన్ను నే కాదని వెళ్ళితి గతిలేని స్థితికి చేరితి )

female ( మాట తప్పాను నిన్ను మరిచాను
క్షమియించి నన్ను బ్రోవుమా
కాదనక నన్ను కావుమా )

ఆదాము పాపమును క్షమియించినావే
చర్మపు వస్త్రమును నిర్మించినావే
కడపటి ఆదామై ఏతెంచినావే
ఈ పాపి కొరకై రిక్తునిగా మారావే
ఇంత చేసిన నీవు నా యెడల మోనమా
చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా

దావీదు పాపమును క్షమియించినావే
ఆ మరణ శాసనము రద్దు చేసినావే
దావీదు పట్టణమందు నా కొరకె పుట్టావే
ఈ గోరపాపి కొరకే బలియాగమయ్యావే
ఇంత చేసిన నీవు నా యెడల మోనమా
చెంత చేరిన నన్ను కాదనకు నేస్తమా
أحدث أقدم