హోమ్పురుషోత్తము.చౌధరి✍ Yesu vanti priya bandhudu nakika niha paramulalo యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న 514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 174 యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న ||యేసు|| ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు ||యేసు|| ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము ||యేసు|| తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము ||యేసు|| ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు|| మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును ||యేసు|| తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు ||యేసు|| అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము ||యేసు||