- విశ్వాసము లేకుండా దేవునికి
- హనోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2
ఎత్తబడకమునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2 || విశ్వాసము ||
- నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్షమొందెను } 2 || విశ్వాసము ||
- మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2 || విశ్వాసము ||
- వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు } 2
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2 || విశ్వాసము ||
ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
రాజ్యాల్ని జయించినారు.......
కామెంట్‌ను పోస్ట్ చేయండి