Song no: 115
- మనసెరిగిన యేసయ్యా
- నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా } 2
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||
- వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా } 2
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||
- మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా } 2
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||
మదిలోన జతగా నిలిచావు }2
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు } 2 || మనసెరిగిన ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి