దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను

242

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్రేమను దండిగ నిచ్చి మమ్మును దయన్ దీవించుము.
    మా యజ్ఞానాంధకారము వ్రయము జేయుము నీ యెక్కువైన తేజము మా యందు పోయుము.
    మా దర్గుణంబు లెల్లను చెదర గొట్టుము మా పాప మణుపుటకై నీ శక్తి జూపుము.
    సన్మార్గమందు నిత్యము మమ్ము నడుపుము నీ మోక్షమందు పిమ్మట మమ్మాదరింపుము.

Post a Comment

కొత్తది పాతది