Song no:
- ఇది న్యాయమా? - ఇది ధర్మమా?
- యేసుని నామములో - రక్షణ వుందట
ఆ యేసుని నమ్మనిచో - నరకం తప్పదట (2)
అది తెలిసిన మీరు - తెలియని మాకు
ఆ వార్తను దాచుట- న్యాయమా?
మా ఆత్మలు దోచుట - ధర్మమా? [ ఇది ]
- ప్రకటించిన చోటే - ప్రకటిస్తున్నారే
విన్నవారికే మళ్ళీ - వినిపిస్తున్నారే (2)
పల్లెలను మరచి - ప్రభు ఆత్మను విడచి
పరిచర్య చేయుట - న్యాయమా?
పట్టణాలలో తిరుగుట - ధర్మమా? [ ఇది ]
శ్రీయేసు వార్తను - దాచుట
నశియించు ఆత్మలన్ - దోచుట [ ఇది ]