హోమ్(ల లోకము వారెల్ల లోకువ జూచిన లోపము నీకేమిటి 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట లోకము వారెల్ల లోకువ జూచిన లోపము నీకేమిటి ప్రాకట ముగ గ్రీస్తు పతిత పావన మూర్తి నీకోసమై ముక్తి నిలయము గట్టంగ ||లోకము||దరిలేని దురిత దుస్తర పారావారము దాటించు వారెవ్వరు భీకరమైన నరకాగ్ని బెట్టు బిం ధుర దేవకోపాగ్ని మరలించు వారెవ్వరు చంచల బుద్ధి స్ధిరపరచి పరమార్ధ మెఱిగించి చిరముక్తి గురి దెల్పు వారెవ్వరు ఈ ధరలోన నరరూపు దాల్చి నీ కొఱకై జీవన మిచ్చు కరుణాబ్ధి క్రీస్తుడు వరదుడై యుండంగ ||లోకము||మాటి మాటికి బాప మార్గమున జనుచుండ మది ద్రిప్పు వారెవ్వరు సైతానుని తాటించి మరి వాని కేటించి యభయ హ స్తము నిచ్చు వారెవ్వరు మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ నాటించి తన యోర్మి చాటించు వారెవ్వరు యెరుషలేము బైట కల్వరిమెట్టు పై మేను బలియిడిన మేటి క్రీస్తుని నామా మృతము నీకుండంగ ||లోకము||హృదయ సంతాపదుః ఖ దురంతమగు చింత ల్వదిలించు వారెవ్వరు నెమ్మది నిచ్చి పదిలమ్ముతో మోక్ష పద మిదుగో యంచు పదమను వారెవ్వరు ఎన్నడు నిన్ను వదలి వెయ్య మంచు మృదువాక్యములు తెల్పి ముద మిచ్చు వారెవ్వరు నింకొక నాడు సదయుడై క్రీస్తుడు చనుదెంచి నిను ముక్తి సదనస్థునిగ జేయు శాస్త్రోక్త మిటులుండ ||లోకము|| ✍ పురుషోత్తము చౌధరి Lokamu Varella – Lokuva Joochina – Lopamu Nikemiti = Praakata Muga Grishu – Pathitha Pavana Murthy – Nikosamai Mukthi – Nilayamu Gatanga || Lokamu || Dharileni Dhurithadhu – Sthara Paravaramu – Dhatinchu Varevaru – Bhikaramaina – Narakaagni Betu Ban – Dhura Devakopaagni – Maralinchu Varevaru– Chanchala Bhudh Dhi = Sthiraparachi Paramaardha – Marriginchi Chiramu Kthi – Guri Dhelpu Varevaru – Ee Dharalona = Nararupu Dhalchi Ni – Korrakai Jeevana Michu – Karunabdhi Kristhundu – Varaddhudai Yundanga || Lokamu || Maai Maatiki Baapa – Maargamuna Januchunda – Madi Dhripu Varevaru – Saithanuni – Thainchi Mari Vaani – Ketinchi Yabhaya Ha – Shamu Nichu Varevaru – Mruthyu Vu Mullu=Meenchi Sukhamatma – Naainchi Thana Yormi – Chatinchu Varevaru – Yerushalemu = Baita Kalvari Mea-Pai Menu Baliedina – Meti Kristhuni Naama – Mruthamu Nikundanga || Lokamu || Hrudaya Sanhapadhu – Kha Dhuranthamagu Chintha – Lvadhilinchu Varevaru – Nemadhi Nichi – Padhilamutho Moksha – Padha Midhigo Yanchu – Pdhamanu Varevaru – Yenadu Ninu = Vadhili Veya Manchu – Mrudhuvaa Kyamulu Thelpi – Mudha Michu Varevaru Ninkoka Naadu = Sadhayudai Kristhundu – Chanudenchi Ninu Mukthi-Sadhanasthuniga Jeyu Shasthroktha Mitulunda || Lokamu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి