Lyrics Life
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Documentation
_Web
_Video
Download This Template
Home
About
Contact
హోమ్
Kalvari Kiranaalu 📀
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం దెలియరే
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం దెలియరే
Online Lyrics List
ఫిబ్రవరి 22, 2024
149
క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని ప్రేమ
రాగం - ఆనందభైరవి
తాళం - కురుజంపె
దేవుని ప్రేమ ఇదిగో – జనులార– భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును
పరలోక – జీవంబు మనకబ్బును } 2
|| దేవుని ||
సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను } 2
సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను } 2
|| దేవుని ||
మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను } 2
మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే } 2
|| దేవుని ||
యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల } 2
దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు } 2
|| దేవుని ||
పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి } 2
పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను } 2
|| దేవుని ||
సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను } 2
సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను } 2
|| దేవుని ||
చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను } 2
సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి } 2
|| దేవుని ||
గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే } 2
మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను } 2
|| దేవుని ||
చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను } 2
పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ } 2
|| దేవుని ||
ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి } 2
వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు } 2
|| దేవుని ||
ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను } 2
మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను } 2
|| దేవుని ||
రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ } 2
రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను } 2
|| దేవుని ||
రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును } 2
పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా } 2
|| దేవుని ||
మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు } 2
నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ } 2
|| దేవుని ||
పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు } 2
పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను } 2
|| దేవుని ||
నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును } 2
నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను } 2
|| దేవుని ||
Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare
Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu ||Devuni||
Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu
Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu ||Devuni||
Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu
Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude ||Devuni||
Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala
Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu ||Devuni||
Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi
Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu ||Devuni||
Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu
Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu ||Devuni||
Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu
Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri ||Devuni||
Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade
Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu ||Devuni||
Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu
Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan ||Devuni||
Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri
Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu ||Devuni||
Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu
Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu ||Devuni||
Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen
Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu ||Devuni||
Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu
Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa ||Devuni||
Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu
Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun ||Devuni||
Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu
Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu ||Devuni||
Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu
Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu ||Devuni||
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా
ఫిబ్రవరి 23, 2024
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
నవంబర్ 03, 2017
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే కొట్టినారా ప్రాణనాధా
మార్చి 29, 2018
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
గెత్సెమనె తోటలో క్రీస్తేసు వేదన మానవాళి విడుదల కొరకైన ప్రార్థన
మార్చి 11, 2024
Tags
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype> !doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
Contact form