Song no: #83
- రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే||
- పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే||
- తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే||
Raare Mana Yesu Swaamini
Joothamu Korke – Loora Priyulaaraa Permini
Goorimi Bhakthula Jeruva Vindata
Bhoorida Yaamrutha Saaramu Lolikedu
Chaaru Kataaksha Vi – shaalekshanudata
Naarakulagu Nara – Naaree Janulaku
Daaraka Mosaganu Daane Pilachunata
Daaruna Paapa Ma-haaranyamunaku
Gaaru Chichchu Gathi Ganpaduvaadata
Ghora Daridratha Goolchedi Vaadata
Saarambagu Thana Sabhaku Makutamata ||Raare||
Pathitha Paavanamou Velpata
Anaadi Deva Suthudai – Ila Jerinaadata
Sathathamu Kadu Duri – Thathamoyuthamagu
Prathi Deshamunaku – Hitha Bhaaskarudata
Athulitha Moksho – nnatha Gunaganudata
Kuthalambuna Sa-dgathi Rahithambagu
Pathithula Gaavanu – Mruthudainaadata
Athi Punya Thanu – Kshatha Shonithamunu
Vrathamuga Siluvanu Nathadosangenata
Mruthini Jayinchuchu Brathiki Lechenata
Mathi Nammina Mana Gathi Yithadenata ||Raare||
Thudaleni Mahima Vaadata
Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata
Chedarina Gorrela – Vedaka Vachchenata
Chidurupalagu Jana Hrudayamulannita
Badilamugaa Ne-mmadi Niduvaadata
Nadithata Mata Jana Vadanamula Sa
mmada Shubhavaarthanu – Balikinavaadata
Sadayatha Sandhula – Kakshula Nidenata
Vedaki Badhirulaku – Veenulosage Nata
Sadamala Moksha Prabhudagu Vibhudata
Yidigo Manakitha Delinavaadata ||Raare||