నా విశ్వాస ఓడ యాత్ర

    నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది
    కొనసాగించే యేసూ....... నాకు తోడుండగా
    తుఫానులైనా. . పెనుగాలులైనా
    ఆపలేవు. . . నా యాత్రను

  1. నా జీవిత యాత్రలో - ఎన్నో తుఫానులు
    అయినా నా యేసు - నా పక్షమైయుండగా
    తుఫానును అణచి - కెరటాలనాపి
    నడిపించిన నా యేసయ్యా

  2. సీయోనుకే నా ఓడ పయనం - ఆగదు ఏ చోట
    విశ్వాసముతోనే ఆరంభించితివి - ఈ యాత్రను
    నే కోరిన ఆ రేవుకే
    నడిపించుము నా యేసయ్యా

  3. నీతి సూర్యుడు ఉదయించు వేళ - ఇలలో ఆనందమే
    సూర్యోదయము కోసమే - నే వేచియున్నాను
    యేసయ్యా రావా కొనుపోవునన్ను - ఇలలో నీవే నాకు



Post a Comment

కొత్తది పాతది