652
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ||
- సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ||
- సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ||
- బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ||
- ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు ||జయ||
- కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు ||జయ||
- దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు ||జయ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి