Chudare siluvanu vre ladu yesayyanu చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను

Song no: 193


చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెందెఁ గదా ||చూడరే||

నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే||

దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే||

పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే||

పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే||
Copyright © Lyrics List. Designed by OddThemes