651
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను||
- రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే||
- ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే||
- ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను||
- నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి