హోమ్ఆ ఆశ్రయుడా నా యేసయ్య ఆశ్రయుడా నా యేసయ్య స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2) విశ్వవిజేతవు – సత్యవిధాతవు నిత్యమహిమకు ఆధారము నీవు (2) లోకసాగరాన కృంగినవేళ నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి నను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతిఆరాధనా (2) || ఆశ్రయుడా || తెల్లని వెన్నెలకాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు (2) కరుణనిచూపి కలుషముబాపి నను ప్రేమించిన ప్రేమవు నీవు (2) జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు ? నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహరాజువు (2) || ఆశ్రయుడా || జీవితదినములు అధికములగునని వాగ్దానముచేసి దీవించితివి (2) ఆపత్కాలమున అండగనిలిచి ఆశలజాడలు చూపించితివి (2) శ్రీమంతుడవై సిరికే రాజువై వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా (2) || ఆశ్రయుడా || నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతిఅర్పణ (2) పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము నేపొందుటకు (2) ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2) || ఆశ్రయుడా || Aashrayudaa Naa Yesayya Stuthi Mahima Prabhaavamu Neekenayya(2) Vishwavijetavu – Satyavidhaatavu Nitya Mahimaku Aadhaaramu Neevu (2) Loka Saagaraana Krungina Vela Nityamainakrupatho Vaathsalayamu Choopi Nanu Cheradeesina Nirmaludaa Neekenayya Aaradhana Neekenayya Stuthi Aaradhana (2) || Aashrayudaa || Tellani Vennela Kaanthivi Neevu Challani Mamatala Manase Neevu (2) Karunanichoopi Kalushamu Baapi Nanu Preminchina Premavu Neevu (2) Janulaku Daivam Jagathiki Deepam Neevugaka Evarunnaaru? Neeve Neeve Ee Srushtilo Koniyadabaduchunna Maharajuva (2) || Aashrayudaa || Jeevitha Dinamulu Adhikamulagunani Vaagdaanamu Chesi Deevinchitivi (2) Aapathkaalamuna Andagani Lichi Aashala Jaadalu Choopinchatavi (2) Sreemantudavai Sirike Raaju Vai Vyadhalanu Baapi Naa Sthiti Maarichitivi Anuraagame Nee Aishwaryamaa Saathvikame Nee Soundaryamaa (2) || Aashrayudaa || Nee Chittamukai Arunodhayamuna Arpinchedanu Naa Stuthi Arpanam (2) Parishuddhulalo Nee Swaasthyamu Yokka Mahimaishwaryamu Ne Pondutaku (2) Prathi Vishayamulo Stuthi Chellinchuchu Parishuddhaathmalo Prardhinchedaru Parishuddhuda Paripoornuda Nee Chittame Naalo Neravechuma (2) || Aashrayudaa ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి