హోమ్క కల్వరిలో యేసు ప్రభు కరుణామృతం కల్వరిలో యేసు ప్రభు కరుణామృతం కురిపించెను ఈ పాపిని ప్రేమించెను కలుషాలు బాపి రక్షించెను (2) || కల్వరిలో || లోతైన గాయాలు పొందెను-నా శాప లోతుల్ని తొలగించెను (2) కృపచూపి నన్ను ప్రేమించెను (2) హేయపు బ్రతుకని నను త్రోయక (2) || కల్వరిలో || సుందర రూపము కోల్పోయెను-సొగసైనను లేక తలవాల్చెను (2) సౌందర్యమంత నాకిచ్చెను (2) స్వరూపమే లేని ఈ పాపికి (2) || కల్వరిలో || యేసుని రుధిరం ప్రవహించెను ప్రేమ సమాధానం అందించెను (2) రక్షణ కుసుమాలు పోయించెను (2) ఇహపరమందున వికసింపగా(2) || కల్వరిలో || కల్వరిలో యేసు ప్రభు కరుణామృతం
కామెంట్‌ను పోస్ట్ చేయండి