ఆనంద యాత్ర ఇది

630

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||

  1. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ రుణము ||ఆనంద||

  2. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండ మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగ ||ఆనంద||

  3. కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము ||ఆనంద||

  4. ఆనందం ఆనందం యేసుని చూచె క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదన్ ||ఆనంద||

Post a Comment

కొత్తది పాతది