ఓ కరుణశీలుడా స్తుతియుంతును


ఓ కరుణశీలుడా స్తుతియుంతును
నా హృదయనాధుడా భజియుంతును
నీ ఘనత నేను ప్రకటింతును
అ.ప : సహాయుడా నీకే ఆరాధన
సజీవుడా నీకే ఆరాధన
1. నాపై యెహోవా దయకలిగి నీవే
నా పర్వతాన్ని స్థిరపరచినావే
మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం
2. నీ ముఖముదాచిన కలతచెంది నేను
మొరపెట్టి నిన్ను బ్రతిమాలినను
నీ కోపము నిమిషమాత్రం దయనిలుచు నిరంతరం
3. నా అంగలార్పును నాట్యముగ మార్చావు
సంతోష వస్త్రము ధరియుంపచేశావు
ఏడ్పువచ్చి రాత్రియున్న ఉదయమున సంతోషం