Ieruvadhi naluguru peddalatho ఇరువది నలుగురు పెద్దలతో

Song no: 4

    ఇరువది నలుగురు పెద్దలతో
    పరిశుద్ధ దూతల సమూహముతో (2)
    నాలుగు జీవుల గానంతో (2)
    స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||

  1. భూమ్యాకాశములన్నియును
    పర్వత సముద్ర జల చరముల్ (2)
    ఆకాశ పక్షులు అనుదినము (2)
    గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||

  2. కరుణారసమగు హృదయుడవు
    పరిశుద్ధ దేవ తనయుడవు (2)
    మనుజుల రక్షణ కారకుడా (2)
    మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||

  3. గుప్పిలి విప్పి కూర్మితోను
    గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
    గొర్రెల కాపరి దావీదు (2)
    అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||


iruvadi naluguru peddalatho
parishuddha doothala samoohamutho (2)
naalugu jeevula gaanamtho (2)
sthuthiyimpabaduchunna maa devaa ||iruvadi||

bhoomyaakaashamulanniyunu
parvatha samudra jala charamul (2)
aakaasha pakshulu anudinamu (2)
gaanamu cheyuchu sthuthiyimpan ||iruvadi||

karunaarasamagu hrudayudavu
parishuddha deva thanayudavu (2)
manujula rakshana kaarakudaa (2)
mahima kaligina maa prabhuvaa ||iruvadi||

guppili vippi koormithonu
goppaga deevenalichchedavu (2)
gorrela kaapari daaveedu (2)
ayyenu entho mahaaraaju ||iruvadi||
Blogger ఆధారితం.