హోమ్(చ చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే 188 సంవత్సరాంత్య ధ్యానము రాగం - బిలహరి (చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేడు యేదశ గూడినాడో ||చూడరే||మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైన దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతని గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగ నంట గొట్టగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్ను గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపద గంటి బ్రాణము లుండునే యిక ||జూడరే||ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపు బ్రక్కపోటు మాటిమాటికి జూడ దుఃఖము మరలునే తలమీద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగ జేసిరి ||చూడరే|| ✍ పురుషోత్తము చౌధరి Chudare Kreesthuni Juudare- Naa Sakhulaaraa – Chuudare Kreesthuni Juudare= Chuudare Naa Mukthi Padhaviki – Redu Ye Dhasa Guudi Naadoa || Chudare || Minchi Ponthi Pilaathu Sathya Mo-Kkinchu Kaina Thalampa Kakkata – Vanchananukottinchi Yuudhula Manchi Thaname Koari Appa – Ginchenaa – Melu Ga –Ninchenaa = Eithani Gaanchi Bhakthu Letlu Sa- Hinchiroa Parikinchi Meeridhi || Chudare || Mantikini Aakaasamunakunu – Madhyamuna Vrelaadu Chundaga – Nanta Gottagasiluva Mraani – Kappaginchuta Koraku Ninnu – Gaanchenaa – Eidhi Madhi – Nenchenaa= Haa Naa Kanta Ne Nitu Vanti Aapadha – Ganti Praanamu Lundune Eika || Judare || Vuutagaa Rakthambu Kaaruchu – Nunda Ballepu Prakka Poatu – Maati Maatiki Juudadhukkamu – Maralune Thala Meedha Mulla Ki- Reetamaa – Eithaniki Vaatamaa = Yuudhulu – Moatulai Baahaatamuna Nee – Paatulanu Gaatamuga Jesiri || Chudare || ✍ Purushotthamu Choudhary చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే
కామెంట్‌ను పోస్ట్ చేయండి