Song no: #52
- ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా||
- చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||
- చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||
- చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||
- నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||
- రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||
- తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి||
- జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||
కామెంట్‌ను పోస్ట్ చేయండి