హోమ్పురుషోత్తము.చౌధరి✍ Yesu nama mentho madhuram yesu nama యేసు నామ మెంతో మధురం యేసు నామ 514 కుటుంబారాధన రాగం - కురంజి తాళం - ఆది Song no: 137 యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు|| స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు|| నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు|| ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు|| మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు|| శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||