నన్ను విడువని యేసయ్యా – నిన్ను విడిచి ఉండనయ్యా
కన్నతల్లి నను మరచినను – ఎన్నడూ మరువనంటివయ్యా
కన్నతల్లి నను మరచినను – ఎన్నడూ మరువనంటివయ్యా
అ.ప: వందనం నీకే – నా
వందనం నీకే
1 నా స్వంత ఆశలతో నిన్ను విడిచి వెళ్ళియుంటిని
ఈ లోక స్నేహముతో నాశనము తెచ్చుకుంటిని
తప్పినా నన్ను వెదకుటకై - నిత్యజీవము నిచ్చుటకై
నీవే దిగివచ్చినావయ్యా - నీవే దిగివచ్చినావయ్యా
ఈ లోక స్నేహముతో నాశనము తెచ్చుకుంటిని
తప్పినా నన్ను వెదకుటకై - నిత్యజీవము నిచ్చుటకై
నీవే దిగివచ్చినావయ్యా - నీవే దిగివచ్చినావయ్యా
2 నీ అరచేతులలో నన్ను నివి చెక్కుకుంటివి
జీవగ్రంధములో నా పేరును రాసియుంటివి
వ్యసనములను నిందలను – నాడు వ్యదిబాధలను
నీవే భరియుంచినావయ్యా - నీవే భరియుంచినావయ్యా
జీవగ్రంధములో నా పేరును రాసియుంటివి
వ్యసనములను నిందలను – నాడు వ్యదిబాధలను
నీవే భరియుంచినావయ్యా - నీవే భరియుంచినావయ్యా
3 విలువైన రక్తముతో నన్ను శుద్ధి చేసియుంటివి
పరిశుద్ధ నామములో కొత్త జన్మనిచ్చియుంటివి
ఆత్మతో సత్యముతో – విరిగిన హృదయముతో
నిన్నే ఆరాధిస్తానయ్యా - నిన్నే ఆరాధిస్తానయ్యా
పరిశుద్ధ నామములో కొత్త జన్మనిచ్చియుంటివి
ఆత్మతో సత్యముతో – విరిగిన హృదయముతో
నిన్నే ఆరాధిస్తానయ్యా - నిన్నే ఆరాధిస్తానయ్యా