కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత

644

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  1. స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  2. పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరి||

  3. దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  4. ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  5. నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  6. రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

  7. హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి||

Post a Comment

కొత్తది పాతది