జీవితమంత నీ ప్రేమగానం

654

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో ||జీవిత||

  1. సర్వసమయములలో నీ స్తుతిగానం ఎల్లవేళలయందు నీ నామధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  2. సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా మా దేవ దేవా నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  3. కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతియింతు నా రక్షకా ||జీవిత||

  4. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీరాజ్యంబులో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా ||

Post a Comment

కొత్తది పాతది