641
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు||
- మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||
- కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు||
- దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూ ఆమేన్ (2) ||ఓ యేసు||
- మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి