642
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- స్వస్థపరచే నిర్దోషముగా ముడత కళంకము లేనిదిగా మహిమ యుక్తంబుగా నిలువగోరె యేసువా సహించుతావా తీర్పునాడూ ||ఓ||
- చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||
- వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్ఠల డాంబికులు అబద్ధజనకుని యాసనము యెజిబెలు నీ మధ్య నివసించెనా కృపావరములు ఆత్మల భారములు ఉజ్జీవదాహము కలదా ||ఓ||
- చల్లగనైనా వెచ్చగనూ ఉండిన నీ కది మేలగును నులివెచ్చని స్థితి నీకుంటే బయటకు ఉమ్మబడెదవేమో నీ మనస్సు మార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో ఆసక్తితోడ రక్షణ నొందు ||ఓ||
- కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారుదువా వడిగా మేఘసీనుడవై నడియాకాశము పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ||ఓ||
- చీకటిలోనుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి