హోమ్Purushotthamu.C 394 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఎందు కే చింతించెదవు నా డెందమా నీ కందమా యిందాక రక్షించినవా డికను నిన్ను విడువబోడు ||ఎందుకే||తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు తరిని చెయ్యి పట్టినాడు అల్లుకొనిన నీ దుర్గణము లణగ ద్రొక్కి వేసినాడు తల్లడిల్లజేయు నీ శత్రువుల దరిమి ప్రోచినాడు నల్లగా దన్నాడా నేడు వద్దు సందేహంబులు వీడు ||ఎందుకే||తల యెత్తరాని చోట గళ లిచ్చి నిలిపినాడు పలుమారు నీ యక్కఱలు తెలిసి యందిచ్చినాడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య వచ్చెడు వాడు పలు విధంబు లగు బాధల బార దోలివేసినాడు నెల విప్పుడు లేదన్నాడా నీతో నిక సరి యన్నాడా ||ఎందుకే||ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాడు దిక్కు నీకిక నేనే యని తన దివ్య వాక్కుల దెలిపెడు వాడు చిక్కు లను బెట్టెడు పగవారి చేత నిను జిక్కింపని వాడు ఇక్కట్టు మెట్టుల దాటించుట కిదిగో యని చెయి యిచ్చెడు వాడు హక్కు లేదన్నాడ నేడు అతడు నిను వెలి వేయబో డు ||ఎందుకే||యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాడు దోసములు వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాడు ఆశతో నీవు గొలిచెడు తండ్రి యంతటా గాపై యున్నాడు నీ సురక్షణ జేయు వారు నిను జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె. చేరువగుచున్నది చూడుము ||ఎందుకే|| ✍ పురుషోత్తము చౌధరి Yendhu ke Chinthinchedhavu Naa – Dendhamaa Nee Kandha Maa = Yindhaaka Rakshinchina Vaa – Dikanu Ninnu Viduva Boadu || Yendhu ke || Tholli Nee Vona Rinchi Natti – Dhoasha Menthoa Arisi Chuudu - Chella Chedharai Parachu Tharini – Cheyyi Pattinaadu – Allu Konina Nee Dhurgunamu – Lanaga Dhrokki Vesi Naadu – Thalla Dilla Jeyu Nee Sa –Thruvula Dharimi Proachi Naadu = Nalla Gaadhannaadaa Nedu Vadhdhu Sandhehambu Veedu || Yendhu ke || Thala Yeththa Raani Choata – Gala Lichchi Nilipi Naadu – Palu Maaru Nee Akkaralu–Thelisi Andhichchi Naadu–Balaheena Mapu Du Neeku Nee – Nirbhaya Miyya Vachchedu Vaadu – Palu Vidhab Mbulagu Baadhala – Paara Thoali Vesi Naadu = Nela Vippudu Ledhannaadaaneethoa Nika Sari Yannaadaa || Yendhu ke || Okka Nee Thala Ventruka Yainaa – Uudi Padadhani Cheppedi Vaadu – Dhikku Neekika Nene Yani Thana – Dhivya Vaakkula Thelipedu Vaadu – Chikkulanu Pettedu Paga Vaari – Chetha Ninu Chikkimpani Vaadu – Eikkattu Mettula Dhaatinchuta – Kidhigoa Yani Cheyyi Yichchedi Vaadu = Hakku Ledhannaada Nedu – Athadu Ninu Veli Veya Boadu || Yendhu ke || Yesu Thana Rakthamuthoa Ninnu – Nenchi Mundhe Konu Chunnaadu – Dhoasamulu Vedalinchu Vimalaa – Thmundu Nee Saakshiga Nunnaadu – Aasathoa Nee Golichedu Thandri – Antha Taa Kaapai Yunnaadu – Nee Surakshana Cheyu Vaaru – Ninu Chutti Yunnaa Rellappudu – Sesha Rahithaanandha Malladhe Cheru Vagu Chunnadhi Chuudumu || Yendhu ke || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి