Song no:
- హోసన్నా…
- గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
గిరులు తరులు సాగరులు
నీకై వీచెను వింధ్యామరలు
పిల్లలు పెద్దలు జగమంతా } 2
నీకై వేచెను బ్రతుకంతా || దావీదు ||
- కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
కరుణా రసమయ నీ నయనాలు
సమతా మమతల సంకేతాలు
కంచర వాహన నీ పయనాలు } 2
జనావాహినికే సుబోధకాలు || దావీదు ||
-
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా
పేదల పాలిటి పెన్నిధివై
పాపుల రక్షకుడైనావు
మకుటము లేని ఓ మహరాజా } 2
పరిచితిమివిగో మా హృదయాలు || దావీదు ||
హోసన్నా హోసన్నా హోసన్నా } 3
అయ్యా.. దావీదు తనయా హోసన్నా
యూదుల రాజా యేసన్నా } 2
హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా || దావీదు ||