పదివేలలోని అతికాంక్షణీయుడు
ఎంతో వికారుడాయెన్

నా నిమిత్తమే శాపగ్రస్థుడై
ఘోరాసిలువను మోసి వహించెన్
ఈ గొప్పప్రేమ నేను మరువన్ జీవితకాలములో|| పదివేలలోని ||

గాయములను శిక్షనిందను
నా శాంతి నిమిత్తమే గదా
నీ శరీరములో పొందితిని నా ప్రియా యేసుదేవా|| పదివేలలోని ||

అన్యాయమైన తీర్పును పొంది
వ్రేలాడేను హీన దొంగల మధ్య
సింహాసనమున నీతో నేనుండి సదా పాలించుటకే|| పదివేలలోని ||

మరణము ద్వారా కృప నొసంగి
అక్షయజీవము నిచ్చితివి
మహిమనుండి అధిక మహిమపొంది
మార్పు నొందుటకేగా|| పదివేలలోని ||

నీ రూపం చూచి సిలువను మోసి
నీతో నడచి సేవను చేసి
నా ప్రాణము  నీకే  అర్పింతును
కడవరకు కాపాడుము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes