దేవా అని అర్ధిస్తే సరిపోవునా }2
బ్రతుకు బాగుపడకుండా కన్నీళ్ళు కార్చినా }2
ప్రభుని క్షమను పొందగలమా దీవెనల నొందగలమా }2
ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
దేవా అని అర్ధిస్తే సరిపోవునా
కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న }2
సుఖ సౌఖ్యమునొందగలమా సౌభాగ్యము పొందగలమూ }2
ఆలోచించుమా ఓ నేస్తమా ఆలోచించుమా ప్రియ సంఘమా
ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
దేవా అని అర్ధిస్తే సరిపోవునా
నోటినిండా బోధలున్నా గుండె నిండా పాపమున్నా }2
ప్రభు రాజ్యం చేరగలమా ఆ మహిమను చూడగలమా }2
ఆలోచించుమా ఓ సేవకా ఆలోచించుమా ప్రియ బోధకా
ప్రభువా అని ప్రార్ధిస్తే చాలునా
దేవా అని అర్ధిస్తే సరిపోవునా