హోమ్Purushotthamu.C 390 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొంద జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందు గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||చింత లిక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||పాపములు వీడుము నీ విక బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబు గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపు గోరెడు కర్త దరి జని ||సందియము||నేరముల నెంచుకో యేసుని కరుణా సారము దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరి జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కగా విని ||సందియము||నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందు చిత్తమ్ముగా కాయమ్ము బలియుడు నీప్రభుని గని ||సందియము||ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపము దోమి ని న్నకళంకు జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిక ||సందియము|| ✍ పురుషోత్తము చౌధరి Sandhiyamu Veedave – Naa Manasaa Yaa – Nandhamuna Guudave = Sandhiyamu Linkela Ninu Such – Mondha Jesedu Kreesthu Rakthapu – Bindhuvulu Subha Vaarha Vaakhyamu –Landhu Gani Thelivondhi Brathukuchu || Sandhiyamu || Chintha Lika Maanumu –Loakulu Thelpu –Braanthul Bada Boakumu = Eantha Vintha Dhurantha Paapamu – Lanthatanu Thanarakthamuna Goa – Rantha Lekaye Thuduchu Nani Si –Dhdhaantha Magu Prabhu Vaakhyamunu Vini || Sandhiyamu || Paapamulu Veedumu – Nee Vika Paschaa- Ththaapamuna Guudumu = Eepu Meerina Yoarputhoa Noka – Paapikaina Layambu Koaraka – Paapu Landharu Hirigi Vachchedu – Koapu Goaredu Karha Dhari Jani || Sandhiyamu || Neramula Nenchukoa – Yesuni Karunaa – Saaramu Thalanchukoa = Bhaaramul Moayuchu Sraman Badu – Vaara Landharu Nammi Naa Dhari Jera Visrama Miththunanu Prabhu – Saara Vaakkelu Chakkagaa Vini || Sandhiyamu || Nimmalamu Nondhumu – Rakshakuni Paluku – Nammukoni Yundumu = Eimmahini Paapulaku Nai Pa –Kshammu Jesi Paraathparuni Samu –Khammu Nandhu Chiththammugaa –Kaayammu Bali Yidu Nee Prabhuni Gani || Sandhiyamu || Premaa Dhayaa Saanthamul–Karthaku Bhuushaa – Sthoama Mulavantha Mul = Nee Moralvini Yesu Naadha Swami Thana Rakthamuna Paapamu Thoami Ni Nnakalanku Jeyunu Nee Madhin Dhaga Nammu Kona Yika || Sandhiyamu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి