హోమ్Purushotthamu.C 435 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యెహోవా మా తండ్రి గాడ యేసుడు మా యన్న గాడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుస దెలిపెం గద మాతోడ ||యెహోవా||మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్ హర్షమిక మా కేమి కొదువ ||యెహోవా||పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||పరమ విభు జీవగ్రంథములో బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా|| ✍ పురుషోత్తము చౌధరి Yehova Maa Thandri Gaada – Yesudu Maa Yanna Gaada = Mahima Gala Sudhdha Athma Eitti – Varusa Thelipengadha Maa Thoada || Yehova || Moaksha Nagaru Maa Puttillu – Mukhya Dhuuthal Maa Snehithulu = Saakshaathkara Mai Yunnappudu – Lakshya Petta Miha Baadhalaku || Yehova || Abraahaamu Dhaaveedhu Modhalainatti Vara Bhakthaa Gre Sarule = Subhramuga Maa Chuttaalainan – Harsha Mika Maa Kemi Kodhuva || Yehova || Pethuraadhi Sakalapoasthul – Permi Gala Maa Nija Kuuta Sthul = Khyaathi Sabhaloa Memunnappudu – Ghanatha Lika Maakemi Velithi || Yehova || Thanuvu Bali Pettenu Maa Yanna – Thappulvida Gottenu Maa Thandri = Manasuloa Saakshya Mitlunna – Manuju Letlannanu Maakemi || Yehova || Karamulatho Nanta Raani – Kannulaku Goacharamu Kaani – Parama Phalamul Maa Kunnappudu – Saraku Gona Mikkadi Lemulaku || Yehova || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి