హోమ్Purushotthamu.C 433 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతో బొత్తు గూడు దమ ||యేసు||ఇహసంబంధుల పొందు జాలింతమ మహా మహుడౌ దేవుని యాజ్ఞ బాలింతమ ||యేసు||శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ ||యేసు||దోషములను బైట బెట్టుదము కపట వేషభాషల గ్రుంగ బట్టు దమ ||యేసు||మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ ||యేసు||జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు||మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరు బెరుకుదమ ||యేసు||పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు దమ ||యేసు||సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు||దినము ప్రార్థన జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు||గురు బోధ స్థలికి బిరబిర బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు గుదమ ||యేసు|| ✍ పురుషోత్తము చౌధరి Yesu Naamabeththi Paadu Dhama = Kreesthu Dhaasulathoa Poththu Guududhama || Yesu || Eiha Sambhandhula Pondhu Chaalinthama = Mahaa Mahu Dow Dhevuni Aajna Paalinthama || Yesu || Subhavaartha Rdhamu Lanni Soadhinthama = Yesu Vibhu Sathya Mila Loana – Nubhavinthama || Yesu || Dhoshamulanu Baita Pettdhama = Kapata- Vesha Bhaashala Kruga Pattdhama || Yesu || Mana Rakshakuni Paatlu Madhi Nenthama = Manasu – Loapali Garvamu Lanupudhama || Yesu || Janula Nindhala Kella Noarchedhama = Boadha – Kani Petti Prabhu Chenthanerchedhama || Yesu || Maanaava Maanamul Bhari Yinthama – Yoarva – Leni Gunamula Veru Perukudhama || Yesu || Parisudhdhaathmanu Bondha Nadugudhama – Budhdhi – Paramaa Nandhamu Jaada Nadupudhama || Yesu || Sakala Maanavu Laathma Sari Chuuthama = Yinka – Moka Michcha Kapumaatalvidichedhama || Yesu || Dhinamu Praardhana Cheya Guri Yunthama = Cheddar – Manasu Badhdhakamupai Nedhirinthama || Yesu || Guru Boadhasthaliki Bira Bira Poadhama – Budhdhi – Thiramunchi Vaakyaardha Merugudhama || Yesu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి